తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి పడిపోయాయి ఉష్ణోగ్రతలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజుల పాటు… చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ 6.7, నల్లవల్లిలో 6.8, అల్మాయిపేట, కోహిర్ 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మెదక్ జిల్లా శివంపేటలో 7.1, టెక్మాల్ 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. సిద్దిపేట జిల్లా బేగంపేట 7.6 అంగడి కిష్టాపూర్ 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్.. జిల్లాలో నే నమోదు అయ్యాయి. రికార్డు స్థాయిలో పడిపోయాయి కనిష్ట ఉష్ణోగ్రతలు. నిర్మల్ జిల్లా తాండ్ర లో 6.3 గా నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర లో 6.4డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా….కొమురం భీం జిల్లా సిర్పూర్ యూ లో 6.7గా నమోదు అయ్యాయి. మంచిర్యాల జిల్లా తపలాపూర్ లో 7.9గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.