టెన్షన్ టెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి ప్రగతిశీల సంఘాల యత్నం

-

రాష్ట్రంలో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి.లగచర్ల రైతుల అరెస్టు, నిర్బంధాలు, బేడీలు వేయడం వంటి ఘటనపై చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ గడ్డం ప్రసాద్ దానిని తిరస్కరించారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు.

 

తాజాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాడ్ చేస్తూ అసెంబ్లీని ప్రగతి శీల యువజన సంఘం సభ్యులు ముట్టడించా యి.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన అసెంబ్లీ, సివిల్ పోలీసులు ఆందోళన చేపడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో నాంపల్లి పీఎస్‌కు తరలిస్తున్నారు. దీంతో అటు చట్టసభల్లోనూ ఇటు అసెంబ్లీ బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news