అప్పులపై భట్టి అవాస్తవాలు..సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన BRS

-

అప్పులపై అసెంబ్లీలో భట్టి విక్రమార్క అవాస్తవాలు మాట్లాడరని…. ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. RBI నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కుల నోటీసులు ఇస్తున్నట్లు తెలిపింది బీఆర్ఎస్‌ పార్టీ.

అప్పుల పై ఆర్ధిక మంత్రి భట్టి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని…. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ”హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందని తెలిపింది.

Image
2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందని బీఆర్‌ఎస్‌ క్లారిటీ ఇచ్చింది. ఆర్ధిక మంత్రి గారు అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు.

 

Image

కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి గారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని తెలిపింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news