బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పై రూ.3.90 లక్షల కోట్ల అప్పు ఉందంటే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్ల అప్పు ఉందంటూ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అప్పుల లెక్కలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అందుకే ప్రభుత్వం పై బీఆర్ఎస్ సభా ఉల్లంఘన నోటీసు ఇచ్చామని సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్టు స్పష్టం చేశారు.
ప్రతీ విషయంలో ప్రోటో కాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు కేటీఆర్. ప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో ఓడిన అభ్యర్థులను కూడా వేదికలపైకి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ను కోరామని కేటీఆర్ తెలిపారు. మరోవైపు ప్రస్తుతం బీఏసీ సమావేశం జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఈ సమావేశానికి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.