తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
పేదరికం అనుభవిస్తున్న వారికి మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. అనర్హులు కూడా రేషన్ కార్డ్ పొంది, ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించి, అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కోరారు తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్ కు పోతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపణలు చేశారు. అవును.. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది నిజమే అంటూ గుత్తా వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుంది – మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
అవును.. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది నిజమే – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి pic.twitter.com/cYQ6Vn6dQX
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024