జనసేనలో నెంబర్ టుగా ఉంటున్న నాగబాబుకు బంఫర్ అఫర్ దక్కింది. త్వరలో నాగబాబు కాస్త.. మంత్రి నాగబాబుగా మారబోతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.. ఇంత వరకూ బాగానే ఉన్నా.. టీడీపీ, జనసేనలో జరుగుతున్న ఓ చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. నాగబాబు ప్రమాణస్వీకారం అలస్యమవుతుందా అన్న మాట వినిపిస్తోంది..
రాజ్యసభ సీటు కావాలని అడిగిన నాగబాబుకు.. సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు.. అయితే ఆయన్ని ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. మరో నాలుగైదు నెలల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.. ఈ క్రమంలో మొదట ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆ తర్వాత మంత్రిని చేస్తారా..లేదంటే రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా అనేది స్పష్టత లేదు..అయితే ఇప్పుడల్లా మంత్రిపదవి దక్కే ఛాన్స్ లేదని టీడీపీ చర్చ జరుగుతోంది..
ముందుగా మంత్రిపదవి చేపట్టి.. తర్వాత ఎమ్మెల్సీని చేస్తే.. పార్టీలో ఏమైనా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందా అన్న దానిపై పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట.. టీడీపీలోనే ఓ వర్గం నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారన్న చర్చ జేనసేనలో నడుస్తోంది.. ఈ క్రమంలోనే నాగబాబుకు మంత్రి అయ్యే యోగం ఆలస్యమయ్యే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది..
పవన్ కళ్యాణ్ తో దోస్తి కలకాలం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నాగబాబును త్వరగానే మంత్రివర్గంలో తీసుకుని పవన్ కళ్యాణ్ ను సంతృప్తి పరుస్తారని చర్చ జరుగుతోంది.. ముహుర్తం చూసుకుని.. నాగబాబుతో ప్రమాణస్వీకారం చేయించి.. సీనిమాటోగ్రఫి శాఖను కేటాయిస్తారని జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.. మొత్తంగా.. త్వరలోనే నాగబాబు ప్రమాణస్వీకారం చేస్తారన్నమాట..