తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ముక్యంగా పంచాయతీ రాజ్ సవరణ చట్టం, ఆర్వోఆర్ చట్టం పై సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్ పరిధిలో 51 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనానికి ఆమోదం తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ధరణి సైట్‌లో అనేక మార్పులు తీసుకురానున్నారు. ధరణికి బదులు భూమాత ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
తెలుంగాణ వస్తు సేవల పన్ను, జీతాలు పెన్షన్ల పెంపు, పురపాలక సంఘాల సవరణ తదితర బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలకు పైగా కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో మంత్రివర్గం పలు కీలక విషయాలపై చర్చించింది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లలు గురించి సుదీర్ఘంగా చర్చించారు.