రివైండ్ 2024: ఆ హీరోలు వెండితెర మీద కనిపించలేదేంటబ్బా..

-

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి విజయాలు దక్కినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలు, కొంతమంది యంగ్ హీరోలు ప్రేక్షకులను థియేటర్లలో పలకరించలేకపోయారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ మొదలైన స్టార్ హీరోలు ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వాళ్లు మాత్రమే కాకుండా యంగ్ హీరోల్లో కొంతమంది థియేటర్లలో కనిపించలేదు.

నవీన్ పొలిశెట్టి:

జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బా నవ్వించిన నవీన్ పోలిశెట్టి.. గత సంవత్సరం 2023లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం మాత్రం అతనికి ఒక్క రిలీజ్ లేదు.

చేతికి తగిలిన గాయం కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని నవీన్ పొలిశెట్టి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

అడవి శేష్:

హిట్ ద సెకండ్ కేస్ తర్వాత అడవి శేష్ కనిపించకుండా పోయాడు. గూడచారి 2, డకాయిట్ -ఒక ప్రేమ కథ అనే సినిమాలు లైనప్ లో ఉన్నప్పటికీ.. 2024లో ప్రేక్షకులను థియేటర్లలో పలకరించలేకపోయాడు.

తాజాగా డకాయిట్ సినిమాలో శృతిహాసన్ నటించడం లేదని వార్త బయటకు వచ్చింది. మరి 2025లో అడవి శేష్ థియేటర్లలో తన సినిమాలతో సందడి చేస్తాడేమో చూడాలి.

సాయి దుర్గ తేజ్:

2023లో విరూపాక్ష, బ్రో సినిమాలతో థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన సాయి దుర్గ తేజ్ 2024లో థియేటర్లను పలకరించలేదు. తాజాగా సంబరాల ఏటిగట్టు టైటిల్ తో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలవుతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news