ఆపిల్ సంస్థకు 65000 కోట్లు చెల్లించనున్న గూగుల్…!

-

గూగుల్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ సెర్చ్ ఇంజిన్, నెంబర్ వన్ బ్రౌజర్, నెంబర్ వన్ ఐటీ కంపెనీ, నెంబర్ వన్ మొబైల్ ఓఎస్, ఇలా అన్నింటిలో నెంబర్ వన్ గూగుల్. మరి.. ఆపిల్ గురించి తీసుకుంటే ఆపిల్ కూడా మొబైల్ ఫోన్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్. ఇప్పుడు ఈ రెండు నెంబర్ వన్ల మధ్య ఓ అద్భుతమైన డీల్ కుదిరింది. అందుకే గూగుల్ దాదాపు 65 వేల కోట్ల రూపాయలను ఆపిల్ కు చెల్లించనుంది. ఏంటా డీల్? ఎందుకు ఆ భారీ మొత్తాన్ని ఆపిల్ కు ముట్టచెబుతోంది గూగుల్.. అనే కదా మీ డౌట్.

ఆపిల్ ఫోన్లు తెలుసు కదా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆపిల్ బ్రాండ్ అంటే జనాలు పడి చచ్చిపోతారు. ప్రపంచం మొత్తం మీద ఎన్ని మొబైల్ బ్రాండ్స్ వచ్చినా.. ఆపిల్ ఆపిలే. అందుకే ఆపిల్ తో జత కట్టింది గూగుల్. ఆపిల్ ఫోన్ లో వేరే బ్రౌజర్లకు స్థానం ఉండదు. ఆపిల్ కంపెనీకి చెందిన బ్రౌజర్ సఫారీనే ఉపయోగించాలి. ఆ సఫారీ బ్రౌజర్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను డీఫాల్ట్ గా ఉంచడం కోసమే ఈ డీల్ అన్నమాట. అంటే మీదగ్గర ఆపిల్ ఫోన్ ఉందనుకోండి. మీరు నెట్ బ్రౌజ్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరు సఫారీ బ్రౌజర్ ను ఓపెన్ చేస్తారు. దాన్న ఓపెన్ చేయగానే మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ డీఫాల్ట్ గా వచ్చేస్తుంది. అదే వీటి మధ్య కుదిరిన డీల్. దాని కోసం 9 బిలియన్ డాలర్లను పే చేస్తున్నది గూగుల్. తన కస్టమర్లను పెంచుకోవడం కోసం గూగుల్ చేస్తున్న ప్రయత్నంలో ఇదీ ఒకటి అన్నమాట. ఆపిల్ కస్టమర్లను తనవైపుకు లాక్కోవడమే ఈ డీల్ ఉద్దేశం.

ఈ డీల్ ఇప్పుడు ప్రారంభమయిందేమీ కాదు. 2013 నుంచే ఆపిల్, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో గూగుల్ ఆపిల్ కు ఒక బిలియన్ డాలర్లు చెల్లించింది. 2017 లో మాత్రం మూడు బిలియన్ డాలర్లు చెల్లించింది. 2018 లో 9 బిలియన్ డాలర్లు, 2019 లో 12 బిలియన్ డాలర్లను చెల్లించనున్నదట.

Read more RELATED
Recommended to you

Latest news