భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టనుండటంతో పార్టీ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది. అయితే మంగళవారం సభలో బిల్లు ప్రవేశపెట్టడం పై జరిగిన ఓటింగ్ కు 20 మంది ఎంపీలు గైర్హాజరు అయ్యారు. దీంతో విప్ ను ధిక్కరించిన సభ్యులందరికీ నోటీసులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.
ముఖ్యంగా కీలక సమయంలో లోక్ సభకు రాకపోవడం పై పార్టీ పెద్దలు వారిపై చాలా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారని ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎందుకు హాజరు కాలేదని కాస్త అధిష్టానం గుర్రుగానే ఉన్నది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరీ.