లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 19న తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ హౌస్ అన్నెక్సేలో ఈ భేటీ జరుగనుంది. జమిలి ఎన్నికల బిల్లు, రైతులకు కనీస మద్దతు ధర, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం వంటి అంశాలపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన విధానం పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
గౌతమ్ అదానీ అంశం, రైతులకు కనీస మద్దతు ధర తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టు బడటంతో సబలు వాయిదా పడుతూ వచ్చాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలలో రాజ్యాంగం పై చర్చ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.