ఆటో డ్రైవర్ల గెటప్‌ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

ఆటో డ్రైవర్ల గెటప్‌ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. నిన్న బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని వచ్చిన ఆటో డ్రైవర్లు… ఇవాళ ఆటో డ్రైవర్ల గెటప్‌ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

BRS MLAs for assembly in auto drivers getup

అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉందని నిప్పులు చెరిగారు. ఆటోడ్రైవర్ల కు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటోడ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇందులో భాగంగానే…ఆటో లలో ఖాకీ డ్రెస్ వేసుకొని అసెంబ్లీకి వచ్చారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.

Read more RELATED
Recommended to you

Latest news