టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దిల్ రాజు నిర్మాతతో పాటు టాలీవుడ్ లో టాప్ డిస్ట్రిబ్యూటర్ కూడా. నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా దిల్ రాజే రిలీజ్ చేయడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక పదవీ కేటాయించింది. తాజాగా ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీకి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల FDC కాంప్లెక్స్ లోని కార్యాలయంలోని బుధవారం నూతన చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. ఇవాళ డిసెంబర్ 18న దిల్ రాజు పుట్టిన రోజు కావడంతో ఈ పదవీని చేపట్టడం విశేషం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా గడుపుతున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్-అనీల్ రావిపూడి మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. జనవరి 14న సంక్రాంతికి విడుదలవుతుండటం విశేషం.