మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమే అని మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమే అన్నారు. అధికారులు తప్పులు చేస్తే ప్రజల డబ్బు వృధా అవుతుందని తెలిపారు. 2019 నుంచి 2022 వరకు మూడు సంవత్సరాలు వరుసగా వరదలు వచ్చినా బ్యారేజీలు తట్టుకున్నాయని రజత్ కుమార్ వెల్లడించారు.
మూడు సంవత్సరాలలో ఎక్కడా కూడా ఇలాంటి లోపాలు లేకుండా బ్యారేజీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరిగాయి. బ్యారేజీ వద్ద డ్యామేజ్ జరుగుతే ఫీల్డ్ లెవల్ లో అధికారులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సి బాధ్యత వహించాలి. ఎన్డిఎస్ఏ కామెంట్స్ పై స్పందించని మాజీ ఐఏఎస్ రజత్ కుమార్. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ ఆదాయం వచ్చేవరకు ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని తెలిపారు. రజత్ కుమార్ సమాధానాలపై హర్షం వ్యక్తం చేశారు కమిషన్ చీఫ్.