అసెంబ్లీలో కరీంనగర్ కొట్లాట..!

-

అసెంబ్లీలో ఇవాళ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై స్వల్ప కాలిక చర్చలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వం తరపున సీతక్క గురుకులాల్లో 50 శాతం డైట్ చార్జీలను పెంచినట్టు, అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని.. కమిటీల ద్వారా 21,941 పాఠశాలలు, 495 కేజీబీవీలలో అత్యవసర పనులు గుర్తించి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.

మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ విద్యార్థినిలు శైలజా, భవాని, లీలావతి గురించి.. గురుకులాల సమస్యలపై మంత్రి మాట్లాడుతారని ఆశించామని.. కానీ సీతక్క వాటిని ప్రస్తావించలేదన్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హీరో వస్తే.. ఒకరు చనిపోతే క్రిమినల్ కేసు పెట్టారని.. గురుకులాల్లో మరణాలపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. మంత్రి పొన్నం స్పందిస్తూ.. 2014 నుంచి గురుకులాల అద్దెలు చెల్లించని మీరా..? మాట్లాడేదంటూ మండిపడ్డారు. మొదటిసారి సభకు వచ్చిన పొన్నంకు సభా నియమాలు తెలియవని గంగుల వ్యాఖ్యానించగా.. మూడు సార్లు పార్టీ మారిన నీవా మాట్లాడేదంటూ విరుచుకుపడ్డారు. గంగుల మాట్లాడుతూ పెప్పర్ స్ప్రే, డూప్లీకేట్ నా, దొంగ ఏడుపులా అని నేను అనలేదని.. కరీంనగర్ నుంచి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని వేరే నియోజకవర్గానికి పారిపోయావని పొన్నం పై విమర్శలు చేయగా.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నా పై పోటీ చేయ్ అని సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్. కేటీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వేరే చోట్ల పోటీ చేశారని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news