తెచ్చిన అప్పుల కంటే.. చెల్లింపులే ఎక్కువ : డిప్యూటీ సీఎం

-

తెచ్చిన అప్పుల కంటే.. చెల్లింపులే ఎక్కువ అని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీలో అప్పులు వాటి చెల్లింపు పై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. తెలంగాణ మొత్తం రూ.6లక్షల 71వేల కోట్లు అని వెల్లడించారు. అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్లు అని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు 40వేల 150 కోట్లు విలువ చేసే బిల్లులు పెండింగ్ పెట్టారని వివరించారు.

Deputy CM Bhatti
Deputy CM Bhatti

అందులో 12 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము రూ.24వేల కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. మేము అధికారంలోకి వచ్చాక రూ.52,118 కోట్లు అప్పులు చేసినట్టు తెలిపారు.  ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగులకు మార్చి 01వ తేదీ నుంచి ప్రతీ నెల 01 వ తేదీనే  జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.20,617 కోట్లు జమ చేశామని తెలిపారు. మేము ఏడాదిలోనే లక్ష కోట్లు అప్పు చేశామని హరీశ్ రావు ఆరోపించారు. వాస్తవానికి హరీశ్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టింది.. ఆర్బీఐ బుక్ లో ప్రింట్ చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news