రివైండ్ 2024 : 2024లో మిడిల్ క్లాస్ వారిని అమితంగా ఆకర్షించిన కార్స్ ఇవే..

-

ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో చాలా కార్లు వినియోదారులను ఆకర్షించాయి. భారతదేశంలో మధ్యతరగతి జనాలు చాలా ఎక్కువ కాబట్టి.. వారిని అమితంగా ఆకర్షించిన కార్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మారుతి సుజుకి డిజైర్:

మధ్యతరగతి ప్రజలకు కార్లను అందుబాటులో ఉంచడంలో ముందుండే కంపెనీ ఏదైనా ఉందంటే అది మారుతి సుజుకి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మారుతి సుజుకి డిజైర్ కార్ల అమ్మకాలు చాలా బాగున్నాయి.

దాదాపు 12 వేరియంట్లలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి డిజైర్ కారు.. ధర 6.9 లక్షలు నుండి 10. 14 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి డిజైర్ కారు గ్లోబల్ ncap టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 Nios:

ఈ కారులో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆటో క్లయిమేట్ కంట్రోల్, 4 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. సిటీలో తిరిగేవారికి ఈ కారు బావుంటుందని చెబుతున్నారు. దీని ధర 7. 2 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుండి మొదలవుతుంది.

టాటా నెక్సాన్:

ప్రస్తుతం టాటా నెక్సన్ ఈవీ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ వైపు మొగ్గు చూపే వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. 208 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో సౌకర్యంగా ఉండే ఈ కారు క్యూబిక్ కెపాసిటీ 1199సిసి నుండి 1497 సిసి వరకు ఉంది. దీనిలో చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయి. దీని ధర 8లక్షల నుండి 15.80 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news