ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం.. ఆ పాపం బీఆర్ఎస్ దే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. ఈ పాపాల బైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ లో భూములు, హైటెక్ సిటీ ఇలా అన్నీ అమ్మేశారు. చివరికీ వైన్ షాపులను మిగల్చలేదు. వీరు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు. పదేల్ల కాలంలో 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. వ్యసనాలు వ్యాపారాలను కూడా బీఆర్ఎస్ కొల్లగొట్టింది. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటున్నాం. హాస్టళ్ల కోసం మీరు ఏం చేశారు..? కేసీఆర్ సభకు వస్తే కడిగేద్దామని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా.. కానీ కేసీఆర్ ఏడాది నుంచి సభకు రావడం లేదన్నారు. అప్పులు ఎక్కడ, తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడకుండా చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి అధికారులపై దాడి చేశారని తెలిపారు.