శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించే ఆహారాలు.. మీ డైట్ లో ఉన్నాయో లేదో చూసుకోండి.

-

శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు పెరగడం వల్ల హార్ట్ ఎటాక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బంది జరిగితే హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి కొన్ని ఆహారాలు ఉపయోగపడతాయి.

ఆల్కహాల్ ముట్టుకోకూడదు:

ఆల్కహాల్ సేవించే అలవాటు అంటే శరీరంలో కొవ్వు పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీ శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గాలంటే ఆల్కహాల్ అలవాటును తక్షణమే మానేయాలి.

చేపలు, చిక్కుళ్ళు:

పై వాటిల్లో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ప్రోటీన్ అవసరం కాబట్టి జంతు మాంసం మీద ఆధారపడకుండా గుడ్లు, చేపలు, చిక్కుళ్ళు టోఫు వంటి వాటిని తీసుకోవడం మంచిది.

సోయా:

దీనిలో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాను పాల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది చెడు కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు:

ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలను తినడం వల్ల చెడు కొవ్వు కరిగిపోయి గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. వారంలో ఒకసారి చేపలను తినటం మంచిది.

పండ్లు, కూరగాయలు:

తాజా కూరగాయలు, పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news