Champions Trophy 2025: భారత్ ఇంగ్లాండ్ టి-20 సిరీస్.. ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

-

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత జట్టుతో ఇంగ్లాండ్ జట్టు ఐదు టి20 మ్యాచ్ లు, మూడు వన్డేలు ఆడబోతోంది. ఈ సిరీస్ జనవరి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ t-20 సిరీస్ కోసం తాజాగా ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోష్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కి ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన సిరీస్ లలో వరుస సెంచరీలతో ఫామ్ లో ఉన్న జో రూట్ తిరిగి ఈ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వనన్నాడు. జట్టు విషయానికి వస్తే : జోష్ బట్లర్ (కెప్టెన్), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టర్, జెమీ స్మిత్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్, అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్ ను ఎంపిక చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇక మొదటి టీ-20 జనవరి 22, రెండో టి-20 జనవరి 25, మూడో టి-20 జనవరి 28, నాలుగోవ టి-20 జనవరి 31, ఐదవ టి-20 ఫిబ్రవరి 2వ తేదీలలో జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news