అద్దె ఇల్లు కోసం చూస్తున్నారా..? అయితే పక్కా ఈ వాస్తు నియమాలను పాటించండి..!

-

వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన అనేక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడడానికి అవుతుంది. చాలా మంది ఇంటిని నిర్మించుకోవడానికి లేదంటే ఏదైనా అద్దె ఇంట్లో దిగడానికి కూడా వాస్తు ప్రకారం చూసుకుంటూ ఉంటారు. అద్దె విషయంలో వాస్తు ని పట్టించుకోని వాళ్ళు కూడా కొంత మంది ఉన్నారు. కానీ వాస్తు ప్రకారం ఫాలో అయితే మంచిది. అద్దె ఇంటికి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ వాస్తు చిట్కాలు అని పాటించాలి అనే వాటి గురించి చూద్దాం. ఎప్పుడైనా మీరు ఇల్లును అద్దెకి తీసుకోవాలనుకుంటే ఈశాన్యభాగం ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి.

 

ఈశాన్యంలో పెద్ద పెద్ద వస్తువులు ఉండకుండా చూసుకోవాలి మంచం లాంటి బరువైన వస్తువులను ఇంటికి దక్షిణం లేదా నైరుతి వైపు ఉంటే మంచిది. బెడ్ రూమ్ నైరుతివైపు ఉండాలని వాస్తు పండితులు చెప్తున్నారు. అయితే పడుకునే సమయంలో తల దర్శనం వైపు పాదాలు మాత్రం ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఇది అవ్వకపోతే పడమర వైపు తలపెట్టి పడుకోవచ్చు. ఉత్తరం వైపు మాత్రం తల పెట్టుకుని నిద్రపోవడం మంచిది కాదు. పూజగది ఉత్తరం లేదంటే ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి.

బాత్రూమ్ ఎప్పుడూ కూడా ఈ వైపు ఉండకూడదు. ఈశాన్యం దశ బాత్రూమ్ ఉన్న ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. అద్దెకు ఇల్లు తీసుకునే ముందు ఇల్లు ఎప్పుడు స్మశాన వాటికకు దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లోకి కాంతి వచ్చేటట్టు చూసుకోవాలి. చీకటిగా ఉండకూడదు. వంటగది ఆగ్నేయం వైపు ఉండేలా చూసుకోండి ఇలా ఈ విషయాలని అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు అనుసరించారంటే ఇబ్బందులు రావు.

Read more RELATED
Recommended to you

Latest news