కపడ కార్పొరేషన్ లో మరోసారి కుర్చీ ఫైట్..!

-

కపడ కార్పొరేషన్ లో మరోసారి కుర్చీ ఫైట్ జరుగుతోంది. మేయర్ పక్కనే మహిళా ఎమ్మెల్యే కుర్చీ వేయాలని మాధవి డిమాండ్ చేసింది.  ఎమ్మెల్యేకు మద్దతుగా నిరసనగా దిగారు టీడీపీ కార్పొరేటర్లు. ఎమ్మెల్యేకు మేయర్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది. మేయర్ కు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు నిలబడ్డారు.

 

వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై మరొకరు నెట్టుకున్నారు. ఎమ్మెల్యే కు కావాలనే మేయర్ కుర్చీ వేయలేదని.. ఎమ్మెల్యే నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కు, డిప్యూటీ సీఎం కి కుర్చీ ఎలా వేశారని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవి. అంతకు ముందు మాధవి తన అనుచరులతో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ కార్పొరేటర్లు పొడియం వద్ద భైఠాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news