మీరు చేస్తున్న జాబ్ మీ జీవితాన్ని దెబ్బ తీస్తుందా? సంకేతాలు ఇవే

-

చదువుకునేటప్పుడు జాబ్ వస్తే చాలు లైఫ్ సెటిల్ అయినట్టే అని అందరూ భావిస్తారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఉద్యోగంలో పడిపోయి అంతకుముందు మనం పెట్టుకున్న లక్ష్యాలను మరచిపోతుంటాం. ఒక్కోసారి ఉద్యోగం జీవితాన్ని బాగా దెబ్బతీస్తుంది.

మీరు చేస్తున్న ఉద్యోగం మీ జీవితాన్ని దెబ్బతీస్తుందో లేదో ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి.

మొదట్లో నచ్చిన ఉద్యోగం ఇప్పుడు నచ్చకపోవడం:

మొదట్లో ఎంతో బాగా సంతృప్తినిచ్చిన ఉద్యోగం ఇప్పుడు నచ్చకపోవడం. ఉద్యోగానికి వెళ్లాలంటేనే ఒక రకమైన విరక్తి అనిపించడం.

ఫోకస్ లేకపోవడం:

ఏ పని మీద దృష్టి నిలప లేకపోవడం, ఉద్యోగంలో సైతం ఫోకస్ గా పని చేయలేకపోవడం.. వంటి లక్షణాలు మీలో ఉన్నట్లయితే.. జాబ్ చేయడం వల్ల మీరు బాగా అలసిపోయారని అర్థం.

రాత్రి నిద్ర రాకపోవడం:

టార్గెట్స్, డెడ్ లైన్స్ మెదడులో తిరుగుతూ నిద్ర పట్టక ఇబ్బంది కలుగుతుంది. నిద్రపోదామని ఎంత ట్రై చేసినా కూడా ఆఫీసులోని అంశాలే గుర్తుకు రావడం.

ఇన్స్ పిరేషన్ లేకపోవడం:

ఒక పని చేయాలంటే ఇన్స్ పిరేషన్ చాలా అవసరం. ఇన్స్ పిరేషన్ ఉంటే పని ఫాస్ట్ గా అవుతుంది. అంతేకాదు పనిలో క్రియేటివిటీ ఉంటుంది. బట్ మీ జాబ్‍లో మీకు ఎలాంటి ఇన్స్ పిరేషన్ దొరకట్లేదంటే ఆ జాబ్ వల్ల మీరు నష్టపోతున్నారని అర్థం.

తలనొప్పి:

జాబ్ టెన్షన్ కారణంగా మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మీరు జాగ్రత్త పడాలి. పని తప్ప మరో ప్రపంచం తెలియకుండా పోతే తలనొప్పి సహజంగానే వస్తుంది.

ఆకలి తగ్గిపోవడం, మాటిమాటికీ మూడ్ మారిపోవడం, ఉదయాన్నే నిద్ర లేవాలని అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాబ్ విషయంలో జాగ్రత్తపడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news