వాళ్లు ఏం పాపం చేశారు.. ప్రభుత్వం పై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఫైర్..!

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సెలవులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఘనంగా క్రిస్మస్ వేడుకలు చేస్తుంది.. కానీ ఆ విద్యార్థులు ఏం పాపం చేశారని పండుగ పూట కూడా కుటుంబం మధ్య లేకుండా హాస్టల్ లోనే ఉండాలని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించాయని.. వీరికి మాత్రం  సీఎం రేవంత్ రెడ్డి సెలవులు ప్రకటించలేదని దుయ్యబట్టారు.

అందరూ పిల్లల మాదిరిగా వీళ్లకు కూడా పండుగ పూట వాళ్ల తల్లిదండ్రులతో గడిపే అవకాశం ఉండాలే కదా..? మీ రాహుల్ గాంధీ చెబుతున్న లౌకితత్వం అంతా ఉట్టిదేనా..? అని ప్రశ్నించారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ప్రతీ ఏడాది ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా సెలవులను ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెలవులను ఇవ్వకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news