ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం.. దాన కిషోర్ స్టేట్ మెంట్ రికార్డు..!

-

ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్ మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ-రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఏసీబీ అధికారులు దాన కిషోర్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. దాదాపు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. దాన కిషోర్ స్టేట్ మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్, కేటీఆర్ లకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఫార్ములా-ఈ రేసింగ్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news