BJP: దుండిగల్ మున్సిపాలిటీ బూత్‌ కమిటీ ఎన్నిక…!

-

బీజేపీ పార్టీ గ్రౌండ్‌ స్థాయిలో బలంగా ఏర్పాటు అయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. తెలంగాణలో బూత్‌ కమిటీల ఏర్పాటును చేపట్టింది. ఇక తాజాగా దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన బూత్‌ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు బూత్‌ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. దుండిగల్‌ ప్రాంతంలో ఈ బూత్‌ కమిటీ ఎన్నిక జరిగింది. బీజేపీ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలోనే… దుండిగల్‌ మున్సిపాలిటీకి చెందిన బూత్‌ కమిటీ ఎన్నిక నిర్వహించారు.

dundigal bjp

ఈ తరుణంలోనే…. 5వ వార్డు బూత్‌ కమిటీ అధ్యక్షులుగా సిహెచ్.కిరణ్ ఎన్నికయ్యారు. 6వ వార్డు బూత్‌ కమిటీ అధ్యక్షులుగా బాలసోని నాగేంద్రబాబును ఎన్నుకున్నారు. ఏలూరి శ్రీదర్ గౌడ్ 7వ వార్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆకుల శివ 8వ వార్డు అధ్యక్షుడిగా, కె రమేష్ 9వ వార్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గొప్పరాజు శ్రీకాంత్ 11వ అధ్యక్షుడిగా, తుడుము సాయిరాం 12వ వార్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా బూత్‌ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు మాట్లాడారు. బూత్ కమిటీల ద్వారానే పార్టీ బలోపేతం అవుతుంది, అన్ని కార్యక్రమాలు బూత్ ద్వారా కిందిస్థాయి ప్రజలకు చేరుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,దేశం కోసం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయికి వెళ్లాలoటే బూతు కమిటీ ద్వారానే సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలకే ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఇక ఈ బూత్ కమిటీ ఎన్నికలో బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  డి విఘ్నేష్ మేడ్చల్ (మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి) ఆకుల మల్లేష్ (సీనియర్ నాయకులు),  ఆకుల విజయ్ (బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్),  తురై భాను గౌడ్ (మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్),  తలారి రాజు కుమార్ (సీనియర్ నాయకులు),  ఇ నర్సింహ గౌడ్ (సీనియర్ నాయకులు),  ఆకుల యశ్వంత్ (బీజేవైఎం అధ్యక్షుడు దుండిగల్ మున్సిపాలిటీ),  జిన్నారం నాగరాజు (సీనియర్ నాయకులు),  కె సదానందం (సీనియర్ నాయకులు),  జిన్నారం మహేష్ Bjp కార్యకర్త,  జిన్నారం  విష్ణు Bjp కార్యకర్త, లడ్డిపిర్ల ప్రణత్ గౌడ్ Bjp కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news