టాలీవుడ్‌ కు మంచు విష్ణు వార్నింగ్‌…!

-

టాలీవుడ్‌ కు మంచు విష్ణు పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి..అప్పటి సీఎంచెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు విష్ణు. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందని తెలిపారు.

the president of MAA association Manchu Vishnu made the announcement

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు వినతి…. సున్నితమైన విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించొద్దని కోరారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదన్నారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల.. సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ‘మా’ సభ్యులకు ఐక్యత అవసరం అంటూ స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు మా అధ్యక్షుడు మంచు విష్ణు.

Read more RELATED
Recommended to you

Latest news