హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత వాజ్ పేయి 100వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసబ ఎంపీ లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ నగేష్ హైదరాబాద్ ప్రాంత బీజేపీ నేతలతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ ర్యాలీని కిషన్ రెడ్డి.. జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందుకు ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలు పూల మాలలు వేశారు. వాజ్ పేయి