కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికి తిరిగి తెలియజేయాలి – కిషన్ రెడ్డి

-

ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బుధవారం హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయంలో వాజ్పేయి శతజయంతి వేడుకల సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బిజెపి అని.. అబద్దాలతో ముందుకు వెళుతున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అంబేద్కర్ బతికినన్ని రోజులు ఆయనని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. ఎన్నికలలో పోటీ చేసిన అంబేద్కర్ ని కాంగ్రెస్ ఓడించిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్ తో నెహ్రూ రాజీనామా చేయించారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు. మోడీ సర్కార్ వాజ్పేయి ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని వెల్లడించారు. 1954 నుండి 88 వరకు నెహ్రూ, ఇందిరా గాంధీ సహా 21 మందికి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇచ్చిందని.. కానీ అంబేద్కర్ ని ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ ఫోటో కూడా పెట్టలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news