మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఇవాళ… తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.
దీంతో ఇవాళ కూడా విద్య సంస్థలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. అదే తెలంగాణ సలహాలోనే ఏపీలో కూడా హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. కాగా, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్… తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఇవాళ సాయంత్రమే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించారు ఆయన కుటుంబ. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. ఈ తరుణంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో మరణించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు… ఆయనకు…. సంతాపం తెలుపుతున్నారు.