2.ఓ టైటిల్ అసలు కథ ఇదే..!

-

రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓపై భారీ అంచనాలే ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ లో శంకర్ డైరక్షన్స్ లో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటేసిందని తెలిసిందే. రజిని, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో అంచనాలను మించి ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా టైటిల్ గా 2.ఓ అని పెట్టడం వెనుక ఓ సర్ ప్రైజ్ విషయాన్ని వెళ్లడించారు దర్శకుడు శంకర్.

రోబో సినిమాలో చిట్టి వస్తున్నప్పుడు 2.ఓ అని వస్తుందని.. రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ స్పూర్తితో రోబో సీక్వల్ గా కథ అనుకున్నప్పుడు 2.ఓ టైటిల్ ఫిక్స్ చేశారట. అంతేకాదు 2.ఓ అంటే అడ్వాన్స్ వర్షన్ అన్నట్టే. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశామని అంటున్నాడు శంకర్. ఈ సినిమాకు సీక్వల్ అనుకోగానే మొదట మొబైల్ ఎడిషన్ ఆలోచన తట్టిందని.. దాన్నుండే కథ పూర్తి చేశానని అన్నాడు శంకర్.

మొత్తానికి రోబో సీక్వల్ గా 2.ఓ కొత్త సంచలనానికి సిద్ధమైంది. దీవాళికి ట్రైలర్.. నవంబర్ 29కి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో వస్తున్న 2.ఓ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news