మేఘా ఆకాష్ లక్కీ ఛాన్స్

-

తమిళ భామ మేఘా ఆకాష్ తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నా ఆమెకు తెలుగులో మాత్రం లక్ కలిసి రాలేదు. ధనుష్ సినిమాతో తమిళంలో హీరోయిన్ గా పరిచయమైన మేఘా ఆకాష్ తెలుగులో నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు ఫ్లాప్ తెచ్చి పెట్టాయి. అయినా సరే మేఘాకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

కొందరికి హిట్ కొట్టినా రాని లక్కీ ఛాన్సులు అమ్మడికి ఫ్లాపులొచ్చినా వస్తున్నాయి. లేటెస్ట్ గా మేఘా ఆకాష్ ఓ బాలీవుడ్ సినిమాలో సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆదిత్య పంచోలి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా చేస్తుంది. ఇదే కాకుండా సూపర్ స్టార్ రజినికాంత్, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న పెట్ట సినిమాలో కూడా మేఘా ఛాన్స్ కొట్టేసింది.

హిట్టు కొట్టకపోయినా సరే మేఘాకు వస్తున్న అవకాశాలు అందర్ని ఆశ్చర్యపరుస్తుంటే.. ఒకవేళ అమ్మడు వరుస హిట్లు కొడితే మిగతా వారి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో వరుసగా రెండు ఫ్లాపులు పడ్డాయి కాబట్టి మరో సినిమా ఆఫర్ వస్తే కనుక ఇక్కడ కూడా మేఘాకు తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news