ఏదైనా పండగ వచ్చినపుడు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ఇంట్లోని పాత సామాన్లను పక్కన పడేసి శుభ్రంగా తయారు చేస్తారు. దానివల్ల మంచి జరుగుతుందని నమ్మకం. అదే విధంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా.. ఈ సంవత్సరం మంచి అలవాట్లు అలవడాలంటే డిజిటల్ చెత్తను పక్కన పడేయాలి. ముఖ్యంగా ప్రోడక్టీవిటీ పెరగాలంటే ఈ పని చేయాలి.
డిజిటల్ చెత్త అంటే..?
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లలో పేరుకుపోయిన చెత్త అని అర్థం. ఎన్నో ఈమెయిల్స్ అవసరం లేనివి వచ్చి ఉంటాయి. ఎన్నో స్క్రీన్ షాట్స్ మొబైల్ లో తీసి ఉంటాము. వాటన్నింటినీ మొబైల్ లోనే ఉంచుకోవడం వల్ల మొబైల్ పర్ఫార్మెన్స్ తగ్గి, మీలో చిరాకును కలిగిస్తుంది. అంతేకాదు, మీకు కావాల్సిన మెయిల్ దొరక్క ఇబ్బంది పడే అవకాశం ఉంది.
డిజిటల్ చెత్తను తొలగించాలంటే చేయాల్సిన పనులు ఏంటంటే..?
వాడని యాప్స్ డిలీట్ చేయాలి:
వందల కొద్దీ యాప్స్ ఉన్నా వాటిలో వాడేది చాలా తక్కువ. వాడని యాప్స్ ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. వెంటనే డిలీట్ చేయండి. దీనివల్ల మీరు ఫోన్ వాడే సమయం తగ్గుతుంది.
అన్సబ్ స్క్రయిబ్:
యూట్యూబ్ లో ఏదో మీకు నచ్చి ఆ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళిచ్చే కంటెంట్ మీకు నచ్చట్లేదు. వెంటనే అన్ సబ్ స్క్రయిబ్ చేసేయండి. మీరు చూసే కంటెంట్ మీ మెదడును ప్రభావితం చేస్తుంది.
స్క్రీన్ షాట్స్ డిలీట్:
వందల కొద్దీ స్క్రీన్ షాట్స్ డిలీట్ చేసేయండి. సంవత్సరాల తరబడి ఉన్న వాటిని డిలీట్ చేసేయడమే ఉత్తమం. డిలీట్ చేయకపోతే మీకు కాలక్షేపం కాని సమయంలో ఆ స్క్రీన్ షాట్స్ వైపు చూసే అవకాశం ఉంది.
ఇంకా పర్సనల్ మెయిల్ బాక్స్ లోని అనవసరమైన మెయిల్స్ తొలగించండి.