ఏఐసీసీ మొత్తం అబద్దాలు ప్రచారం చేసే వారితో నిండిపోయిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రియా శ్రీనెట్ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాల పోస్టు చేశారు. కాంగ్రెస్ ఫేక్ న్యూస్ పేడర్లతో నిండిపోయిందని.. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రూ.1కూడా అందలేదని వ్యాఖ్యానించారు. మహిళలకు సాధికారిత కల్పించాల్సి పోయి.. వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఇళ్లను కూల్చివేయడం, కూరగాయలు వ్యాపారులను రోడ్డున పడేయడం గర్భిణులను బలవంతంగా వీధుల్లో నెట్టడం లాంటివి చేసారని మండిపడ్డారు.
మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం అని ఆగ్రహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనో రేప్.. కేసులు దారుణంగా 28.94 శాతం పెరిగియని, మహిళలపై హత్యలు 13 శాతం, కిడ్నాప్ లు, దొంగతనాలు 26 శాతం పెరిగాయని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన భద్రత ఎక్కడ ఉందని నిలదీశారు. మహిళలపై దౌర్జన్యాలు 8 శాతం పెరిగాయని వారి ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోందన్నారు.