నేను కూడా హిందువునే.. నన్ను క్షమించండి: శ్రీముఖి

-

ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి వివాదాల్లో చిక్కుకుంది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది. ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని శ్రీరామచంద్రుడు, లక్ష్మణుల మధ్య అనుబంధంతో కంపేర్ చేయబోయి.. హడావిడిలో తడబడింది శ్రీముఖి.

రామలక్ష్మణులు ఫిక్షనల్ అని, దిల్ రాజు, శిరీష్ నిజమని నోరు జారింది. హిందూ సమాజం దేవుడిగా భావించే రాముడిని ఆయన సోదరుడు లక్ష్మణుడిని కల్పిత పాత్రలుగా శ్రీముఖి పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు హిందుత్వ వాదులు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది శ్రీముఖి. రామలక్ష్మణుల గురించి తాను పొరపాటుగా మాట్లాడానని ఆవేదన వ్యక్తం చేసింది.

అలా మాట్లాడినందుకు ప్రజలకు క్షమాపణలు తెలియజేసింది. ” నేను యాంకర్ గా వ్యవహరించిన ఓ సినిమా ఈవెంట్ లో రామలక్ష్మణుల గురించి పొరపాటుగా మాట్లాడాను. దీంతో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. నేను శ్రీరాముడిని అమితంగా విశ్వసించే వ్యక్తిని. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటా. ఈ విషయంలో అందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించండి” అని తెలిపింది శ్రీముఖి.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news