బీజేపీ – వైసీపీది అక్రమ సంబంధం అన్నారు వైఎస్ షర్మిల. ఇవాళ మౌనదీక్ష చేశారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… ఆంధ్ర ప్రజలకు మోడీ వెన్నుపోటు పొడిచారని…ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని తెలిపారు. అలాంటి మోడీ తో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నారని… ఫైర్ అయ్యారు. టీడీపీ సక్రమ సంబంధం పెట్టుకుంటే వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుందని చురకలు అంటించారు.
జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న… బడుగు బలహీన వర్గాల ఓట్లుతో గెలిచి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయ పార్టీ బీజేపీ అని… అలాంటి పార్టీకి వైస్ జగన్ మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీ ని వ్యతిరేకిస్తున్న వారిలో రాజశేఖర్ బిడ్డ నేను మాత్రమేనని…చెప్పారు. అంబేద్కర్ ను ఘోరంగా అవమానించిన అమిత్ షా ను వెంటనే హోం మినిష్టర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.