డీజీల్‌ తో నడించే క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం – రేవంత్ రెడ్డి

-

క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సరైన ప్రాంతమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.హైటెక్ సిటీ సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.


అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య నివారణకు 3,200 వేల ఈవీ బస్సులు తెచ్చామని, ఈవీ వాహానాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, నగరంలో 55 కి.మీ మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. 2050 ప్రణాళికతో మంచినీటి వసతిని కల్పిస్తామని, 360 కి.మీ రీజీనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్,లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news