తెలుగు వారి గొప్పతనం ఏంటో అనేది డాకు మహారాజ్ : నందమూరి బాలకృష్ణ

-

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. తాజాగా హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వాస్తవానికి ఈ ఫంక్షన్ అనంతపురంలో జరుపుకోవాల్సింది. కానీ తిరుమలలో తొక్కిసలాటలో మరణించడంతో వాయిదా వేశాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్ర యూనిట్ తరపున కూడా ప్రకటించారు. క్రమశిక్షణ కలిగిన వారు తన అభిమానులు అని తెలిపారు. వేల, లక్షల, కోట్ల మంది అభిమానులను పంపడం అంటే విడలేని అనుబంధం అనిపిస్తుంది. 

విశ్వానికి విశ్వనటరూపం ఎలా ఉంటుందో గుర్తించిన విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారకరామారావు-బసవతారకమయికి, కళామాతల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో ఎవ్వరూ చేయని పాత్రలు నాన్న గారు చేశారు. కుమారుడిగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చేశానని తెలిపారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సూపర్ హిట్ అయ్యాయి. డాకు మహారాజ్ కూడా సూపర్ హిట్ అవుతుంది. నా ప్రతీ సినిమాలో మహిళలకు ప్రత్యేకత ఉంటుంది. సినిమా నుంచి సందేశం ఇవ్వాలని భావిస్తాం. తెలుగు వారి గొప్పతనం ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగిందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news