తాను ఎవ్వరి మద్దతు కోరడం లేదని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్ణాటక సీఎం మార్పు ఊహగానాలపై డిప్యూటీ సీఎం డీకే శికుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవ్వరిపై ఒత్తిడి చేయడం లేదన్నారు. అలాగే తాను ఎవ్వరి మద్దతూ కోరుకోవడం లేదని.. ఎమ్మెల్యేలు తనకు మద్దతూ కోరుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
K
“నేను కర్మనే నమ్ముకున్నా ఫలితాన్ని దేవుడికే వదిలేస్తా. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తా” అని డీ.కే.శివకుమార్ పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి సిరసంగి లింగరాజ దేశాయ్ మాట్లాడుతూ.. సిద్దరామయ్యనే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. రాజకీయాల్లో అనేక మార్పులు జరగవచ్చు.. కానీ సీఎం గా మాత్రం సిద్ధరామయ్యనే కొనసాగుతారు.