మోడీజీ.. రూపాయి పతనం పై మీ సమాధానం ఏంటి..? : ప్రియాంక గాంధీ

-

అమెరికా డాలర్ తో రూపాయి మారకం భారీగా తగ్గిపోవడం పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. శుక్రవారం రూపాయి విలువ ఒక్కసారిగా 16 పైసలు క్షీణించి చరిత్రలోనే తొలిసారిగా 86.04కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.

“చరిత్రలోనే తొలిసారిగా రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి చేరుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో డాలర్ తో రూపాయి మారకం విలువ 58-59 గా ఉండేది. అప్పట్లో నరేంద్ర మోడీ రూపాయి విలువను ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపెట్టేవారు. డబ్బు విలువ ఏ దేశంలోనూ ఇంతగా పడిపోదని, అంతా తనకే తెలుసు అని చెప్పేవారు. మరీ ఇప్పుడు ఏమైంది. ఆయనే ప్రధాని గా ఉన్నారు. పతనంలో రూపాయి రికార్డులు సృష్టిస్తోంది. రోజు రోజుకు దాని విలువ పడిపోతుంది. అందువల్ల దేశ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ. 

Read more RELATED
Recommended to you

Latest news