తెలంగాణలో 250 పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 250 పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు రవాణా శాఖ కమిషనర్. నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్న 250 పైగా ప్రైవేటు వాహన బస్సులపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లు రవాణా కమిషనర్ తెలిపారు.
హైదరాబాద్ ,రంగారెడ్డి .నల్గొండ లోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. సరుకు తీసుకెళ్తున్న వాహనాలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశామని కమిషనర్ తెలిపారు.
ఈ తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు రవాణా శాఖ కమిషనర్.