గుడ్ న్యూస్‌.. భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం దిగొచ్చింది. రూ.350 పతనమైంది. దీంతో బంగారం ధర రూ.41,830 నుంచి రూ.41,480కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.38,360 నుంచి రూ.38,020కు పతనమైంది. బంగారం ధర పడిపోతే కేజీ వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ఏకంగా రూ.600 తగ్గుదలతో రూ.49,600 నుంచి రూ.49,000కు దిగొచ్చింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 దిగొచ్చింది. దీంతో ధర రూ.38,850కు తగ్గింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గుదలతో రూ.40,050కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.600 పడిపోయింది. రూ.49,000కు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news