కోపాన్ని అణుచుకోవడం అనేది చాలా అవసరం. ఆ కాసేపు రెచ్చిపోయి చెలరేగిపోయి ఏది అనిపిస్తే అది చేస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. అయితే అంత కంటే మరో మంచి మార్గం ఉందని అంటున్నారు వైద్యులు. కోపం రాకుండా శరీరాన్ని సిద్దం చేయవచ్చని సూచిస్తున్నారు. దీనికి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఉదయాన్నే అరగంట నడకతో మొదలు పెట్టి, నలభై నిమిషాల పాటు యోగా చేసి.. మరో పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలని, ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ రోజు అంతే ప్రశాంతంగా గడుస్తుందని అంటున్నారు. అదే విధంగా ఆహారాన్ని మార్చుకోక కూడా కీలకం. ఉద్రేకాలను ప్రేరేపించే మసాలాలు, ఉప్పు, కారం తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. సాత్విక ఆహారం తీసుకుంటే సమస్యలు ఉండవని అంటున్నారు.
వేసవిలో వీలైనంత వరకు రోజూ కీరా ముక్కలు, పుచ్చకాయ, టొమాటో రసం, ఫ్రూట్ సలాడ్స్, పల్చటి మజ్జిగ తీసుకోవడం, మంసాహారం తగ్గించడం వంటివి చెయ్యాలి. ధూమపానం, మద్యం కూడా ఉద్రేకాలకు కారణం అవుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. అదే విధంగా మంచి నిద్ర ఉండటం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ముందు దానితో చికాకులు రావన్నమాట.