పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. నువ్వెక్కడ పోయావని అడిగిన ప్రశ్నకు తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రి తుమ్మల. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధానికి అభినందనలు చెప్పడం కూడా తప్పేనా అని పేర్కొన్నారు.
“అభినందనలు చెప్పడం కూడా తప్పే అంటే అది మీ రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాను. పసుపు బోర్డు ఏర్పాటు అర్ధరాత్రి ప్రకటించి.. తెల్లారి ప్రారంభించిన మేము తప్పు పట్టడం లేదు. ఫెడరల్ స్ఫూర్తి నీక్కూడా పాటించలేదు మీరు. మీకు కొన్ని విషయాలు చెబుతాను. మీరు నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కాబట్టి.. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక మూడుసార్లు కేంద్రానికి లేఖలు రాశాను. రెండుసార్లు మా కమిషనర్ తో లేఖ రాయించా. మా సీఎంతో కూడా కేంద్రాన్ని అడిగించా. నేను ఎక్కడ ఉన్నా ఆ శాఖ కి పూర్తిగా న్యాయం చేస్తా. కావాలంటే మీ బీజేపీ పెద్దలను అడుగు నా పనితీరు గురించి” అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.