డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి 1.50 నిమిషాల మధ్య ఎగిరింది డ్రోన్. అయితే.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం రేపడంతో… పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతాపరమైన కారణాలతో డీజీపికి, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకి ఫిర్యాదు చేసింది సిబ్బంది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ క్యాంపు కార్యాలయంపై ఎగిరిన గుర్తు తెలియని డ్రోన్
మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి 1.50 నిమిషాల మధ్య ఎగిరిన డ్రోన్
భద్రతాపరమైన కారణాలతో డీజీపికి, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకి ఫిర్యాదు చేసిన సిబ్బంది… pic.twitter.com/3XSO02vCc9
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025