తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత… దారుణంగా విఫలమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో… తడబడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… అప్పులు చేసిన కేసీఆర్ మాత్రమే… తెలంగాణను అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలుపరిచారని… మళ్లీ సారే రావాలని అంటున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… తెరపైకి వస్తున్నాయి. మొన్న ఖమ్మం జిల్లాలో… చంద్రబాబు అలాగే కేసిఆర్ ఫోటోలు ఉన్న బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మరోసారి కేసీఆర్ తో పాటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఉన్న బ్యానర్ కలకలం రేపుతోంది. ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో… ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు. చంద్రబాబు ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యాడని… త్వరలో కేసీఆర్ రాబోతున్నాడని.. రాస్తూ ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు.
ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు pic.twitter.com/kzpJcMWPK1
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025