ఏపీ రాజకీయాల్లో స్వార్థపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని, అందుకు బీజేపీయే కారణమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారతదేశ రాజ్యంగ పరిరక్షణను కాంగ్రెస్ ప్రాథమిక బాధ్యతగా తీసుకున్నదని, రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.
ఏపీలో బీజేపీ మరోసారి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని గిల్లిగజ్జాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని, చంద్రబాబును కుర్చీలో నుంచి దింపే ప్రయత్నం జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ఆయనతో కయ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రమాదం అని తెలిసినా పవన్ కళ్యాణ్‌తో బీజేపీ ముందుకు వెళ్లిందని, బాబుని పక్కకు తొయ్యాలనే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.