తెలంగాణకు ఆ లోటు లేకుండా చేస్తా.. దావోస్ లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది మా ప్రభుత్వ ఆకాంక్ష అని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మా ప్రభుత్వం సమకూర్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ , హీరో మోటార్ కార్ప్  సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news