కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడం.. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయడంతో భారత్ విజయం సునాయసం అయింది. అంతకు ముందు తొలుత టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. స్కోర్ 0 కే అర్స్ దీప్ సింగ్ తన మూడో బంతికే సాల్ట్ ను పెవీలియన్ కు చేర్చాడు. ఆ తరువాత తన రెండో ఓవర్ లో మరో ఓపెనర్ డకెట్ ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. వరుణ్ ఛక్రవర్తి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు.
మరోవైపు కెప్టెన్ బట్లర్ 68 పరుగులు చేయగా.. అతన్ని పెవీలియన్ కు చేర్చాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే.. 34 బంతుల్లోనే 79 పరుగులు సాధించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 8 సిక్స్ లు, 5 ఫోర్లు బాదాడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మెరుపు ఇన్నింగ్స్ తో యువరాజ్ తరువాత రెండో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు కే.ఎల్. రాహుల్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. ఆ రికార్డును బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. దీంతో 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ ఛేదించింది.