తెలంగాణ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగులో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తన పేరు లేదని ఓ రైతు ఏకంగా గ్రామ సభలోనే అధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ సభ ఏర్పాటు చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించిన ప్రజా పాలనలో పలు సంక్షేమ పథకాలకు కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు అప్లికేషన్ చేసుకున్నాడు.
అయితే ఇవాళ గ్రామ సభ లో వివిధ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను అనౌన్స్ చేయగా.. తాను పెట్టిన అర్జీలకు దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై.. అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. అయితే అతన్ని అధికారులు, ప్రజలు నిలవరించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అతను పరుగుల మందు సగానికి పైగా తాగడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగామారడంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.